
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అదికార్లకు సూచించారు. బుధవారం ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం లో జరుగుతున్నషేడ్ నిర్మాణ పనులను, క్యూలైన్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 మహా మేడారం జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు వెడల్పు, గద్దెల ప్రాంగణంలో క్యూలైన్లు మార్పులు చేర్పుల ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్ పై ఎండోమెంట్, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, పూజారుల తో కలెక్టర్ చర్చించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాడువాయి పరిధిలోని మేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు.
కలెక్టర్ వైద్య సిబ్బందితో మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తతతో ఉండి, మలేరియా డెంగ్యూ వ్యాధులను నియంత్రించాలని, ఫీవర్ సర్వే చేయాలని, ఇంటింటి సందర్శనలో దోమల లార్వాను కలిగిన నీటిని తొలగించాలని, ప్రతి జ్వరపీడుతులకు మలేరియా డెంగ్యూ ఆర్డిటి రక్త పరీక్షలు చేయాలని ఆరోగ్య సిబ్బందినీ ఆదేశించారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఎండోమెంట్ ఈవో వీరస్వామి, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు పూజారులు, ఎం సి హెచ్ టీం డాక్టర్ కీర్తి, స్టాఫ్ నర్స్ మమత, సూపర్వైజర్ సరస్వతి ఆరోగ్య కార్యకర్త రాజ్యలక్ష్మి తిరుపతయ్య, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………