*అభినందించిన దివాకర టి.ఎస్
ఆకేరు న్యూస్, ములుగు: గ్రూపు 2 ద్వారా నియమితులై ములుగు జిల్లా కు కేటాయించ బడిన ముగ్గురు ఎంపిఓ లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. కు కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కలను అందించారు.విధుల్లో చేరిన ముగ్గురు ఎంపిఓ లకు జిల్లా కలెక్టరు అభినందిస్తూ, ప్రజలకు సేవలందించే క్రమంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. గ్రూప్ 2 ద్వారా నియామకం పొందడం అభినందనీయమని అన్నారు. విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని బాధ్యతలను సమర్థవంతంగా నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. మండలాలకు కొత్త ఎం పి ఓ లుగా ఏటూరునాగారం మండలం కు పి వినయ్,ఎస్.ఎస్. తాడ్వాయి కి జి.మహేందర్, వెంకటాపురం జి.జమ్మిలాల్.తదితరులు ఆయా మండలాల్లో విధులు నిర్వర్తి స్తారని వివరించారు.
