* సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టు పరిశీలన, చర్చ
* ప్రాజెక్టు క్వాలిటీ కంట్రోల్ వివరాలు సేకరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project)నిర్మాణంలో గత ప్రాజెక్టు హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టేందుకు మరోసారి కమిషన్(Commission) తెలంగాణకు వచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టును పరిశీలించనుంది. ప్రాజెక్టు క్వాలిటీ కంట్రోల్(Quality Control) పై వివరాలు సేకరించింది. నిర్మాణంలో సాంకేతిక అంశాలను పరిశీలించనుంది. అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇప్పటికే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను తెలుసుకునేందుకు ఈ కమిషన్ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్ల నుంచి వాంగ్మూలాలను ఈ కమిషన్ రికార్డు చేసింది. గతంలోనే బ్యారేజీలను కమిషన్ సభ్యులు పరిశీలించారు. మేడిగడ్డ(Medigadda) బ్యారేజీ పైర్లు మునిగిపోవడం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి లీకేజీలు ఏర్పడడడంపై ఆరా తీసింది. ఈసారి అధికారులు, ఇంజినీర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.
……………………………….