ఆకేరున్యూస్, హైదరాబాద్: కాళోజీ అవార్డు ఎంపికకు అందెశ్రీ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడి కమిటీని ఏర్పాటు చేసింది. సభ్యులుగా అదనపు కలెక్టర్, కవి. ఏనుగు నరసింహారెడ్డి. భాషా పండితుడు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంగంభట్ల నర్సయ్య. కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధి పొట్లపల్లి శ్రీనివాస్. భాష, సంస్కృతి శాఖ దర్శకుడు మామిడి హరికృష్ణను ఎంపిక చేసింది. కాళోజీ అవార్డు గ్రహీతకు రూ.లక్షావేయి నూట పదహారు నగదు బహుమతి, శాలువా, మొమెంటోతో సత్కరించనుంది.
—————-