* వాహనదారులకు ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు
* అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసిన పోలీస్ బాస్
ఆకేరున్యూస్, ములుగు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా శనివారం నుంచి జిల్లా ఎస్పీ శబరిష్ ఆదివారం ఉదయం వరకు రహదారి వెంటగల లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పస్రా నుంచి తాడ్వాయి మధ్య గల జలగలంచ వాగు జాతీయ రహదారి పైనుంచి వరద ఉధృతంగా ప్రవహించడం వల్ల రోడ్డు ధ్వంసం అయింది. గమనించిన ఎస్పీ ఆ ప్రాంతం వద్ద సిబ్బందిని నియమించారు. కార్లు, మోటార్ సైకిల్ మినహాయించి లారీల వంటి భారీ వాహనాలను అక్కడికక్కడే నిలిపి ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే వాగులు పొంగే ప్రదేశాలలో బారిగేట్లను పెట్టి సిబ్బందిని నియమించారు. జాతీయ రహదారి ప్రధాన కూడళ్ల వద్ద ఏటూరునాగారం, తాడ్వాయి, పస్రా వంటి ప్రాంతాలలో పోలీస్ సిబ్బందినిని కేటాయించి వారి ద్వారా వాహనదారులకు తగు సూచనలు అందిస్తూ ప్రమాదానికి తావివ్వకుండా తగు జాగ్రత్తలను ఎస్పీ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ రవీందర్, నాగారం సీఐ శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, పస్రా ఎస్సై కమలాకర్, ములుగు రెండో ఎస్ఐ రామకృష్ణ, ఎటునాగారం రెండో ఎస్ఐ రమేష్, ఏటూరు నాగారం, తాడ్వాయి పస్రా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.