* తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం జాతర పరిసరాలలో రెండవ పంట నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం, మేడారం తుడుం దెబ్బ గ్రామ కమిటీ, మేడారం పంట నష్టపరిహార సాధన సమితి ఆధ్వర్యంలో దుగ్గి చిరంజీవి అధ్యక్షతన ఐటీడీఏ క్యాంప్ ఆఫీసు నుండి ర్యాలీ నిర్వహించి మేడారం గద్దెల ముందు నష్టపరిహారం చెల్లించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, ములుగు జిల్లా కార్యదర్శి గొంది రాజేష్ మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా రెండవ పంట వేసుకోవద్దని అధికారులు ప్రభుత్వం రైతులకు చెబుతున్నారని నష్టపరిహారం మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పంట నష్టపోయే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నిర్దిష్టంగా శాశ్వత తరహాలో నష్టపరిహారం ఇవ్వాలని మేడారం జాతరలో శాశ్వత బస్టాండ్ ను ఏర్పాటు చేయాలని, రోడ్డు వెడల్పు కారణంగా నష్టపోతున్న చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని,మేడారంలో 24 గంటల వైద్య సదుపాయం అందించాలని జాతర తర్వాత కూడా రద్దీగా ఉండే ప్రాంతాలలో శాశ్వతమైన టాయిలెట్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అభివృద్ధి చేయాలని, తాత్కాలికమైన పనులు నాసిరకమైన పనులు కాకుండా శాశ్వతమైన నాణ్యమైన పనులు చేయాలని డిమాండ్ చేశారు. మేడారం జాతరకు 300 కోట్లు కేటాయించాలని, జాతర తర్వాత పారిశుద్ధ్య పనులు సత్వరతగా చేయాలని అని అన్నారు ప్రతి సంవత్సరం జాతరకు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ శాశ్వతమైన పనులు మాత్రం చేయకుండా నాసిరకమైన పనులు చేసి కాంట్రాక్టర్లు డబ్బులు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మేడారం తుడుం దెబ్బ గ్రామ కమిటీ అధ్యక్షులు గడిగే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఫిఫ్త్ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో పెస చట్టం అనుమతి లేకుండా ఈ ప్రభుత్వాలు పనులు చేపడుతున్నాయని, అవసరం లేని చోట కూడా రోడ్డు అనేది వెడల్పు చేసి చిరు వ్యాపారస్తులకు నష్టం కలిగిస్తున్నారని వాళ్లకు ఉపాధి లేకుండా చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ మన చట్టాల గురించి తెలుసుకొని సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సమస్యల సాధన కోసం పోరాటం చేయాలని కోరారు.మేడారం పంట నష్టపరిహార సాధన సమితి అధ్యక్షులు ఆలం కృష్ణార్జున్ మాట్లాడుతూ జాతర సందర్భంగా అనేక మంది రైతులు వంట నష్టపోతున్నారని అభివృద్ధి పేరుతో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాలకు శాశ్వత తరహాలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడారం ప్రధాన పూజారి సిద్దమైన సురేందర్ ,జిల్లా కార్యదర్శి గొంది రాజేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు జజ్జరి దామోదర్, జిల్లా కమిటీ సభ్యులు అలెం అశోక్, తోలం కృష్ణయ్య, పునెం నాగేష్, కుర్సం చిరంజీవి, మలకం సత్యనారాయణ,మల్లెల మనోహర్ ధర్మసమాజ్ పార్టీ ములుగు ఇన్చార్జి, వట్టం సురేష్ మేడారం తుడుం దెబ్బ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు, చర్ప చంద్రశేఖర్ పంట నష్టపరిహార సాధన సమితి కార్యదర్శి, చెడం బాబు మేడారం మాజీ సర్పంచ్, ఆలం సమ్మక్క పీర్ల భారతి, గడిగే సుధారాణి తల్లడి గౌరమ్మ సిద్ధ బోయిన సుగుణ చెరుకుల లక్ష్మి కోరం శారద గొంది రమేష్ గొంది సాంబయ్య పీర్ల వినోద్ ప్రధాన కార్యదర్శి తుడుం దెబ్బ గ్రామ కమిటీ, సిద్ధబోయిన ఆనంద్ ఆలం సమ్మారావు గోపాలపురం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………
