
– సిబ్బందిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్ (RV KARNAN) స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో అనుమతి లేని, అక్రమంగా చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి 37 మంది ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించగా వాటిలో చాలా గతంలో కూడా వచ్చిన ఫిర్యాదులే ఉన్నాయి. దీంతో సిబ్బందిపై ఆర్వీ కర్ణన్ అసహనం వ్యక్తం చేశారు. పదే పదే అవే సమస్యలు వస్తుండడంతో పరిష్కార చర్యల్లో లోపం కనిపిస్తోందని, ఆ పరిస్థితి తలెత్తకుండా విభాగాధిపతులు కృషి చేయాలని జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. కాగగా, ఆస్తి పన్ను వివాదాలు, రెండు పడకల ఇళ్లకు సంబంధించి ఏడు చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. అధ్వాన రహదారులు, నాలాలు, ఇతరత్రా సమస్యలను పౌరులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర కార్యాలయంలో 74, ఆరు జోనల్ కార్యాలయాల్లో 126 ఫిర్యాదులు వచ్చాయని జీహెచ్ఎంసీ పేర్కొంది.
…………………………………………………