
* నితిన్ గడ్కరీని కోరిన ఎంపీ కడియం కావ్య
*సానుకూలంగా స్పందించిన గడ్కరీ
ఆకేరున్యూస్,హనుమకొండ: భూపాలపల్లి ( BHUPALAPALLY) బై పాస్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వరంగల్ ఎంపీ కడియం (MP KADIYAM KAVYA)కావ్య కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని (NITHIN GADKARI) కోరారు.పార్లమెంట్(PARLIAMENT)సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ కడియం కావ్య శుక్రవారం నితిన్ గడ్కరీని కలుసుకున్నారు. భూపాలపల్లి బైపాస్ రోడ్డును త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలో డీపీఆర్ పూర్తి చేసి నిధులు మంజూరు చేస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.. భూపాలపల్లి పట్టణంలో ప్రధానంగా భారీ ట్రాఫిక్, బొగ్గు రవాణా, పవర్ ప్లాంట్ యాక్టివిటీల వల్ల NH-353C మీద తీవ్ర వాహన రద్దీ పెరగడంతో పట్టణంమధ్యలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఎంపీ కేంద్రమంత్రికి వివరించారు. గత మూడు సంవత్సరాల్లో 576 రోడ్డుప్రమాదాలు జరగడంతో దాదాపు 233 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి భూపాలపల్లి పట్టణాన్ని దాటి వెళ్లే ప్రత్యేక బైపాస్ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని కేంద్ర మంత్రిని ఎంపీ కోరారు. 250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బైపాస్ రోడ్డులో,175 కోట్లు నిర్మాణ పనులకు, 75 కోట్లు భూసేకరణకు వినియోగించలని ఈ నిధులను 2025- 2026 వార్షిక ప్రణాళికలో చేర్చాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు స్పందించిన కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఈ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు ఇస్తామని తెలియజేసారు. అందుకు సంబంధించిన DPR ను తయారు చేసి టెండర్ పనులు పూర్తి చేస్తామని వివరణాత్మక లేఖ ద్వారా కేంద్ర మంత్రి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ .. భూపాలపల్లి పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ళ సమస్య తీరనుందని అన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య, ప్రజల భద్రతో పాటు ప్రయాణదూరంలో లాభం కలుగుతుందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆశాభావం వ్యక్తం చేశారు..
………………………………………..