Kakatiya University Degree Semester Results 2026 Released
ఆకేరు న్యూస్, హన్మకొండ:
కాకతీయ విశ్వవిద్యాలయం (KU) డిగ్రీ విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం అధికారికంగా విడుదల చేసింది.
ఈ మేరకు ఫలితాల వివరాలను పరీక్షల నియంత్రణాధికారి (Controller of Examinations) ఆచార్య రాజేందర్ కట్ల వెల్లడించారు.
* ఉత్తీర్ణత శాతం వివరాలు..
మొదటి సెమిస్టర్- 28%
రెండో సెమిస్టర్- 33%
మూడో సెమిస్టర్- 38%
నాలుగో సెమిస్టర్- 38%
పరీక్షలు రాసిన విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.
ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్.. http://www.kakatiya.ac.in లేదా http://www.kuonline.co.in

Please tell us what is wrong. Your report will be sent to the website team.
