BJP Cells Expansion
* దేశవ్యాప్తంగా కమలం పార్టీ సెల్స్
* బీజేపీ విభాగాల సహ సమన్వయకర్త విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడి
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బీజేపీ సెల్స్, వివిధ విభాగాలను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక మార్గ నిర్దేశం చేశారని విభాగాల సహ సమన్వయకర్త విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పలు అంశాలపై వారు చర్చించినట్లు పేర్కొన్నారు. బీజేపీ విభాగాల సహ సమన్వయకర్తగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం న్యూఢిల్లీలో జేపీ నడ్డాను ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ అభిరుచి ఉన్న వ్యక్తులను పార్టీ సెల్స్ ద్వారా అనుసంధానం చేయాలని నడ్డా సూచించారన్నారు. ప్రజా జీవితంలో చురుకుగా ఉంటూ వివిధ రంగాల్లో రాణిస్తున్న వారి ప్రతిభను పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని చెప్పారు. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీ విభాగాలు విస్తృతంగా పర్యటించి నూతన వర్గాలను భాగస్వాములను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. దీని ద్వారా పార్టీలో సంఖ్యా బలం పెరిగేందుకు దోహదం అవుతుందని ఆయన సూచించారు. నడ్డా అందించిన సూచనలు, సహకారానికి విష్ణువర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నడ్డా నాయకత్వం, మార్గదర్శకత్వంతో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీ సెల్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. యువతకు రాజకీయాలపై ఆసక్తి కలిగించేలా చేసి, ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న పలువురు ప్రముఖులను సెల్స్ ద్వారా పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని నడ్డాకు వెల్లడించినట్లు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
