* మా ప్రాజెక్టులతోనే బీఆర్ ఎస్ సరఫరా చేసింది
* ఉచిత విద్యుత్ కోసం 13,992 కోట్లు చెల్లించా – మల్లు భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, ఖమ్మం : కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని, మేం గతంలో చేపట్టిన ప్రాజెక్టులతోనే పదేళ్ల పాటు .. బీఆర్ ఎస్ కరెంట్ సరఫరా చేసిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (bhatti vikramarka) తెలిపారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన విద్యుత్ అంబులెన్స్ (Electric Ambulence) లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది శ్రమను కళ్లారా చూశానని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వరదల సమయంలో ప్రాణాలు తెగించి విద్యుత్ పునరుద్ధరణకు కష్టపడి పనిచేశారని కొనియాడారు. పదేళ్లలో బీఆర్ ఎస్ (Brs) ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టూ నిర్మించలేదన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కొందరు అజ్ఞానంతో మాట్లాడారని, ముందు చూపుతో ప్రాజెక్టులు కట్టగలిగేది తమ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
