
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే గేట్ వద్ద గల రైల్వే ఓవర్ బ్రిడ్జిని జూన్ నెలలోగా పూర్తి చేస్తామనీ చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఉప్పల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పట్ల బిజెపి నాయకులకు చిత్తశుద్ధి లేదంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారపల్లి మహేష్ మాట్లాడుతూ.. స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆర్ఓబిని పరిశీలించి జూన్ నెలాఖరులోగా పూర్తవుతుందని లేకపోతే జెసిబి లు పెట్టి బ్రిడ్జి కూల్చివేస్తామనీ, జూన్ నెల దాటి జూలై వచ్చిన ఇంకా నిర్మాణం పూర్తి కాలేదనీ, ఇంకెన్ని రోజులు మాటలతో ప్రజలను మోసం చేస్తారంటూ ప్రశ్నించారు.కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రవీందర్ గారు, మొండేద్దుల నాగరాజ్, వాసాల శ్రీనివాస్, విష్ణు దాస్ వంశీధర్, మొగులయ్య, గణేష్, శ్రీధర్, సత్యపాల్, తిరుపతి, సంపత్, రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………