
రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి షాక్
* సీఎం వ్యాఖ్యలకు కౌంటర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ లో చేసిన పోస్టు సంచలనంగా మారింది. దీనిపై పార్టీలోనూ, రాజకీయంగానూ చర్చ జరుగుతోంది. “రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.” అని రాజగోపాల్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈరోజు ఓ ప్రధాన పత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్ ను కూడా జత చేశారు. రాజగోపాల్ రెడ్డి (RAJAGOPLA REDDY) పెట్టిన ఈ పోస్టుపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎంకు కౌంటర్ ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు రేవంత్ ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTH REDDY) శుక్రవారం ఓ సభలో మాట్లాడుతూ.. మరో పదేళ్లు అంటే 2034 వరకు తానే సీఎంగా ఉంటానని ప్రకటించేశారు. పాలమూరు బిడ్డనైన తానే ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయమన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అన్నారు. ఈమేరకు రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది..
______________________________________________________