ఆకేరున్యూస్, వరంగల్: నక్సల్స్ చేతుల్లో మరణించిన ఎస్సై ఐ యాదగిరిరెడ్డి వర్థంతిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత ఎస్ఐ యాదగిరిరెడ్డి చిత్రపటానికి సీపీ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ ఉన్నతాధికారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిషోర్ఝా మాట్లాడుతూ.. 1985 సంవత్సరం సెప్టెంబర్ 2న కాజీపేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యాదగిరి రెడ్డి తన భార్యను కాజీపేట రైల్వే స్టేషన్లో ఎక్కించి తిరిగి వస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపి హత్యచేశారన్నారు. యాదగిరి రెడ్డి ఆశయ సాధనకు ప్రతి పోలీస్ కృషి చేయాలని సూచించారు. ఆలాగే ఎస్ఐ యాదగిరి రెడ్డి సేవలకు గుర్తుగా కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ ప్రాంగణానికి ఎస్ఐ యాదగిరి రెడ్డి సమావేశ ప్రాంగణంగా వరంగల్ పోలీస్ కమిషనర్ నామకరణం చేశారు. కార్యక్రమములో అదనపు డీసీపీ రవి, ఏసీపీ జితేందర్ రెడ్డి, డేవిడ్రాజు, పోలీస్ సంక్షేమాధికారి ఆర్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Related Stories
January 13, 2025