– 432 రైళ్లు, 1400 ఆర్టీసీ బస్సులు రద్దు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : . ఎక్కడ చూసినా నడుభారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రహదారులు ధ్వసం అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలం చేశాయిము లోతు నీళ్లు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారులపై వరద నీరు చేరి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వర్షాలకు రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోవడంతో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే 432 రైళ్లు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య నడిచే బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే సుమారు 1400 బస్సులు రద్దు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ పలు మార్గాల్లో బస్సులను రద్దు చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అలాగే, విజయవాడ వెళ్లే పలు ఆర్టీసీ బస్సులను గుంటూరు మీదుగా మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తరువాత బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామన్నారు. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం మరో 570 కలిపి 1400కు పైగా బస్సులను రద్దు చేశారు. ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. వరదలతో వికారాబాద్లో 212 బస్సులకు గానూ 50 మాత్రమే నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
-432 రైళ్లు రద్దు
భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల ట్రైన్ ట్రాక్లు ధ్వసం అయ్యాయి. మరికొన్ని ట్రాక్లు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించినట్లు, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ధ్వంసం అయిన రైల్వే ట్రాక్లు మరమ్మతు చేసిన అనంతరం వాతావరణం అనుకూలిస్తే రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.