* పోలింగ్ నేపథ్యంలో సీపీ సజ్జనార్ నిషేధాజ్ఞలు
* గుంపులుగా కనిపిస్తే చట్ట రీత్యా చర్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
జూబ్లీహిల్స్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీ సజ్జనార్ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రతలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో బిఎన్ ఎస్ ఎస్ 163 అమల్లో ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలు అవుతాయన్నారు. నియోజకర్గ పరిధిలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువగా, గుంపులు గుంపులుగా కనిపిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నిక అనంతరం ఫలితాల సందర్భంగా నవంబర్ 14 సాయంత్రం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు 163 అమలు ఉంటుందన్నారు. లిక్కర్ షాపులు, క్లబ్లులు, రెస్టారెంట్లు మూసి వేయాలని ఆదేశించారు. పోలీసుల ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.
