* మార్నింగ్ వాక్ వెళ్లిన చందు రాథోడ్
* ఇంటికి తిరిగి వస్తుండగా కళ్లల్లో కారం కొట్టిన దుండగులు
* భయంతో పరుగులు తీసిన చందు రాథోడ్
* చందు రాథోడ్ ను వెంబడించి కాల్పులు జరిపిన దుండగులు
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది,
గుర్తు తెలియన వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సీపీఐ నేత చందు రాథోడ్ మృతి చెందారు. ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లిన చందునాయక్ ను వెంబడించిన దుండగులు మార్రింగ్ వాక్ చేసి ఇంటికి వెళ్తండగా దారి కాచి మరీ హత్య చేశారు. చందు రాథోడ్ ను అడ్డగించి అతడి కళ్లల్లో కారం చల్లడంతో భయంతో పరుగులు తీసిన చందురాథోడ్ ను వెంబడించి కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్ల కాల్పులు జరుపడంతో చందు రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన తరువాత దుండగులు కారులో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని రాథోడ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం పంపారు.నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ హైదరాబాద్ లోని చైతన్యపురిలో నివాసం ఉంటున్నాడు.ఈ హత్యకు రాజకీయ కక్షలు కారణమా లేక పాతకక్షలు కారణమా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
…………………………………………..
