Tamil Nadu
* 12,692 బస్సుల్లో ఉచిత ప్రయాణం
Tamil Nadu| ఆకేరు న్యూస్, తమిళనాడు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విస్తరించే వెట్రి పయనం పథకాన్ని అక్టోబర్ 2న తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది. గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సోమవారం చెన్నై సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 24న అసెంబ్లీలో ప్రకటించిన విస్తరణలో భాగంగా ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్ సర్వీసులతో పాటు 40 కిలోమీటర్లకు మించిన ఘాట్, కొండ మార్గాల్లో నడిచే సాధారణ బస్సులు, మోఫుసిల్ సాధారణ బస్సులను కూడా పథకం పరిధిలోకి తీసుకురానున్నారు.
రాష్ట్రంలోని ఏడు రవాణా సంస్థలు నడుపుతున్న 18,413 షెడ్యూల్డ్ బస్సుల్లో 12,692 బస్సులు ఈ పథకం పరిధిలోకి రానున్నాయి. అలాగే 1,94,649 షెడ్యూల్డ్ సింగిల్ ట్రిప్పుల్లో 1,65,312 ట్రిప్పులు పథకం కింద ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి.
మహిళలకు ప్రయోజనం
విస్తరించిన ‘వెట్రి పయనం’ పథకం ద్వారా రోజుకు సుమారు 84.32 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం అంచనా వేసింది. ఉద్యోగాలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఇతర అవసరమైన సేవలకు వెళ్లే మహిళలకు రవాణా ఖర్చు తగ్గించడం ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
సెప్టెంబర్ 27న ట్రయల్ రన్
పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా పథకం పరిధిలోకి వచ్చే బస్సుల్లో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్ల (ETMs)ను అనుసంధానం చేశారు. సెప్టెంబర్ 25 నాటికి సిస్టమ్ టెస్టింగ్, వెరిఫికేషన్ పూర్తి చేసి.. సెప్టెంబర్ 27న ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
