* సీపీఎం నాయకులకు రేవంత్ వినతి
* ఆలోచించి చెబుతామన్న కమ్యూనిస్టు నేతలు
* 16 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు
ఆకేరు న్యూస్, భువనగిరి : భువనగిరి లోక్‌సభ బరిలో సీపీఎం పోటీ చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా జహంగీర్ ప్రచారం చేస్తున్నారు. అయితే.. తాజాగా రేవంత్ రెడ్డితో సీపీఎం నాయకుల భేటీ నేపథ్యంలో సీపీఎం పోటీ నుంచి తప్పుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వీరయ్యతోపాటు పలువురు కీలక నేతలు సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది. భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను కోరారు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీలో కీలక రాజకీయ అంశాలపై చర్చించామన్నారు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. భువనగిరి పార్లమెంట్ స్థానంలో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. దానికి తాము అంగీకరించలేదని, ఆలోచించి తమ నిర్ణయం చెబుతామన్నారు. భువనగిరి సీటు విషయంలో సందిగ్ధం ఉన్నప్పటికీ.. మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు తమ్మినేని వీరభద్రం.
——————–