Raghava Lawrence Political Entry
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళ సినీ పరిశ్రమ నుంచి మరో స్టార్ హీరో రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
* విజయ్ సృష్టించిన స్ఫూర్తి..
ఇటీవలే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించి, రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై రాఘవ లారెన్స్ స్పందిస్తూ.. తమిళ రాజకీయాల్లో విజయ్ ఒక సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. రాజకీయాల్లోకి ఎవరైనా రాణించగలరనే బలమైన నమ్మకాన్ని, ధైర్యాన్ని విజయ్ అందరిలోనూ కలిగించారని లారెన్స్ పేర్కొన్నారు.
* అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ..
తాను రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన గురించి తన తల్లితో చర్చించినట్లు లారెన్స్ వెల్లడించారు. “నేను పాలిటిక్స్‌లోకి వెళ్లాలా వద్దా అని మా అమ్మను అడిగాను. అందుకు ఆమె సంతోషంగా అనుమతి ఇచ్చింది. అమ్మ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది కానీ, నా తుది నిర్ణయం మాత్రం ప్రజల అభిప్రాయంపైనే ఆధారపడి ఉంటుంది” అని లారెన్స్ స్పష్టం చేశారు.
* అంతా ప్రజల చేతుల్లోనే..
లారెన్స్ సినిమాలతో పాటు ‘లాట్రస్ ఫౌండేషన్’ ద్వారా ఎంతో మంది అనాథ పిల్లలకు, వికలాంగులకు, గుండె జబ్బులతో బాధపడే వారికి సేవ చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. “ప్రజలు నా రాజకీయ ప్రవేశాన్ని ఆమోదించి, నన్ను రమ్మని కోరితే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. ఒకవేళ ప్రజలు వద్దనుకుంటే మాత్రం పాలిటిక్స్‌కు దూరంగా ఉండి ఎప్పటిలాగే నా సేవా కార్యక్రమాలు చేసుకుంటాను” అని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం లారెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సేవా గుణంతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న లారెన్స్, నిజంగానే పాలిటిక్స్‌లోకి వస్తే విజయ్ లాగే సక్సెస్ అవుతారని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
