Crazy Kalyanam
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కల్యాణం’. యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా చిత్రంలోని ‘అల సెంద్రవంక’ పాటను హైదరాబాద్‌లోని వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థుల సందడి మధ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్ ఉడ్డెమారి పాల్గొని తన డ్యాన్స్, మాటలతో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థులు సైతం పాటకు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.
ఈ సందర్భంగా అఖిల్ ఉడ్డెమారి మాట్లాడుతూ.. ‘క్రేజీ కల్యాణం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు.
‘అల సెంద్రవంక’ పాటకు సురేష్ బొబ్బిలి మెలోడీ ట్యూన్ అందించగా.. గోరటి వెంకన్న సాహిత్యం రాశారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు.
ఈ చిత్రానికి సాయి కదిర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, శ్రీపాల్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, అఖిల్ సాయి శ్రీమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్ యాక్షన్, శ్రావణ్ కటికనేని ఎడిటింగ్, శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పాటలను గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్ రచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
