Chakora Pre Release Event
Chakora| ఆకేరు న్యూస్, విశాఖ: యువతను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ‘చకోర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో ఘనంగా జరిగింది.
హాయ్ జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వింటేజ్ ఐకానిక్ సంస్థ నిర్మాణ సారథ్యం వహిస్తోంది. మంగా శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీగా ‘చకోర’ రూపొందింది. ఈ సినిమాతో శ్రవణ్, మలైకా టి. వాసుపల్ కొత్త ప్రేమజంటగా పరిచయం అవుతున్నారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
స్వచ్ఛమైన ప్రేమే కథాంశం
దర్శకుడు మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘చకోర’ ఒక అందమైన ప్రేమకథ అని తెలిపారు. స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురుచూడాలనే భావనను సినిమాలో చూపించినట్లు చెప్పారు. చకోర పక్షి వర్షపు నీటితోనే దాహం తీర్చుకుంటుందనే భావనను, జీవితంలో స్వచ్ఛమైన ప్రేమను ఎంచుకోవాలనే ఆలోచనతో ముడిపెట్టినట్లు వివరించారు.
అలాగే చకోర పక్షి జాబిల్లిని చేరుకోవాలనే లక్ష్యంతో నిరంతరం ప్రయత్నిస్తుందనే అంశాన్ని సినిమాలో ప్రధాన సందేశంగా చూపించినట్లు తెలిపారు. లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలతో ప్రయత్నించాలనే సందేశం ప్రేక్షకులకు చేరుతుందని అన్నారు.
సినిమాకు ఇప్పటికే ప్రివ్యూలు ప్రదర్శించామని, వీక్షించిన వారు దీనిని జెన్-జీ ప్రేమకథగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, క్లాసికల్ కమర్షియల్ సినిమాగా అభివర్ణిస్తున్నారని దర్శకుడు తెలిపారు. ఫస్టాఫ్, సెకండాఫ్‌పై కూడా మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు.
టీమ్ కల
నిర్మాత డా. చింతాడ హేమారావు మాట్లాడుతూ.. ‘చకోర’ తమ టీమ్ అందరి కల అని తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, భిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. సినిమా చూసిన ప్రేక్షకుల ప్రశంసలు, చప్పట్లే తమకు విలువైన ఆస్తి అని అన్నారు.
చకోర పక్షిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో అనుకున్న లక్ష్యాలను పట్టుదలతో సాధించాలని ఆయన సూచించారు. ఈ నెల 9న విడుదల కానున్న ‘చకోర’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరోయిన్ మలైకా టి. వాసుపల్, హీరో శ్రవణ్, డీవోపీ రుప్ప గోపీకృష్ణ, హీరోయిన్ అనుష్క లూహార్, నటుడు సుమన్, దర్శకుడు శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
