* నాకు తెలియదన్న పొంగులేటి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కొడుకు పొంగులేటి హర్ష (Ponguleti Harsha) నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు ఆరు గంటల పాటు ఈ సోదాలు కొనసాగినట్లు తెలిసింది. కోటి రూపాయలకు పైగా విలువ గల లగ్జరీ వాచ్లను స్మగ్లింగ్ (Luxury Watch Smuggling) చేశారన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లోని పొంగులేటి హర్ష నివాసంలో సోదాలు జరిగాయి. తన కుమారుడి నివాసంలో సోదాల గురించి మంత్రి పొంగులేటిని మీడియా అడిగితే ఆయన సమాధానం దాటవేశారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో ఉన్నానని, పార్టీ పనుల్లో బిజీగా ఉన్నానని సమాధానం చెప్పారు. రూ.1.7 కోట్ల విలువైన చేతి గడియారాలను స్మగ్లింగ్ చేశారన్న కేసులో పొంగులేటి తనయుడు హర్షకు చెన్నై కస్టమ్స్ అధికారులు ఏప్రిల్ లోనే సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం పొంగులేటి హర్షరెడ్డి.. రాఘవ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా ఉన్నారు.
—————