ఆకేరున్యూస్, నాగర్కర్నూల్ : కాయకష్టం చేసి కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని ఘటన ఎదురైంది. తాను తీసుకున్న కల్లు సీసాను తాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ సీసాలో కట్ల పాము ప్రత్యక్షమైంది. దీంతో ఆందోళనకు గురైన ఆ వ్యక్తి తాగిన రెండు బుక్కల కల్లును నోట్లో నుంచి బయటకు ఉమ్మేశాడు. అతనికి ప్రాణాపాయం కూడా తప్పింది. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు కల్లు దుకాణంపై దాడి చేశారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లిలో వెలుగుచూసింది. కాగా,, స్థానికులు ఆగ్రహానికి గురైన తర్వాత కూడా ఆ కల్లు దుకాణం యజమాని నిర్లక్ష్యంతో జనాలకు కల్లు విక్రయించాడు. తమ ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.

