ఆకేరు న్యూస్, డెస్క్ : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఖేల్ రత్నా పురస్కారాలను(Khel Ratna Awards) క్రీడాకారులు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu) పురస్కారాలను అందజేశారు. హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, చెస్ విభాగంలో డి.గుకేశ్, షూటింగ్ విభాగంలో మను బాకర్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ జివాంజీ దీప్తి, జ్యోతి యర్రాజీ కూడా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. ఇక వీరితో పాటు మరో 32 మంది అర్జున, ఐదుగురు అథ్లెట్లు ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో బ్యాడ్మింటన్ స్టార్ మురళీధరన్(Muralidharan), ఫుట్‌బాల్ ప్లేయర్ అర్మాండో ఆగ్నెలో కొలాకో రాష్ట్రపతి చేతుల మీద ఈ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. వీరితో పాటు అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతూ (బాక్సింగ్), స్వీటీ బురా (బాక్సింగ్), సలీమా(హాకీ), వంతిక అగర్వాల్(చెస్), అభిషేక్ (హాకీ), అభయ్ సింగ్(స్క్వాష్), సంజయ్(హాకీ), హర్మన్‌ప్రీత్ సింగ్(హాకీ), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), స్వప్నిల్ సురేశ్ కుసాలే(షూటింగ్), సరబ్జోత్ సింగ్ (షూటింగ్), సుఖ్జీత్ సింగ్(హాకీ), అమన్ (రెజ్లింగ్) తదితరులు అర్జున అవార్డుల(Arjun Awards)ను అందుకున్నారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
