* మందాకినీ నదిలో కూలిన వైనం
ఆకేరు న్యూస్ డెస్క్ : కేదార్నాథ్ (Kedarnath)లో ఓ హెలికాప్టర్ (Helicopter) కూలిపోయింది. ఆర్మీ ఎంఐ-17 ఛాపర్ (MI 17 Chopper) నుంచి ఒక్కసారిగా జారి కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేదార్నాథ్ సందర్శన సమయంలో యాత్రికులను తరలించేందుకు వినియోగించే ఓ క్రెస్టల్ హెలికాప్టర్ ఇటీవలే ల్యాండింగ్ సమయంలో దెబ్బతింది. దీంతో రంగంలోకి దిగిన సైన్యం దాన్ని తరలించేందుకు ఆర్మీ ఎంఐ-17 చాపర్‌ను వినియోగించారు. ప్రత్యేకమైన కేబుల్స్‌తో క్రెస్టల్ హెలికాప్టర్‌ను ఛాపర్‌కు కట్టి తరలించారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఎంఐ-17కి అమర్చిన తీగలు తెగిపోయాయి. దీంతో వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్ హెలికాప్టర్ మందాకిని నది (Mandakini River) సమీపంలో జారి పడింది. ఈ ఘటనలో హెలికాప్టర్ మొత్తం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని సంబంధిత అధికారులు తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది.