
* పోలీసుల అదుపులో నిందితులు
* పరారీలో ప్రధాన నిందితుడు
* నకిలీ సిమ్ కార్డులతో మోసాలు
ఆకేరు న్యూస్, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల ( MANCHIRYALA) జిల్లా జన్నారం( JANNARAM)లో సైబర్ నేరాల (Cyber fraud) కు సెటప్ చేసిన ఇంటిని గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడి చేయడంతో సైబర్ నేరాల గుట్టు వెలుగుచూసింది. కొంతకాలంగా సైబర్ నేరాలు అధికమవడంతో టెలికమ్యూని కేషన్, సెక్యూరిటీ బ్యూరో నిఘా పెట్టింది. దీంతో మంచిర్యాల జిల్లా నుంచి నేరదందా సాగుతుందని తెలుసుకొని రామగుండం పోలీసులతో కలిసి ఇంటిని కనుగొన్నారు. సైబర్ నేరస్తులు ఏర్పాటు చేసుకున్న సెటప్ ను చూసి సెక్యూరిటీ బ్యూరో పోలీసులు నివ్వెరపోయారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కామేశ్, బావు బాషయ్య, మధుకర్(32) రాజేశ్వర్ (40)లు దొరికారు. ప్రధాన నిందితుడు పలవల్సుల సాయికృష్ణ అలియాస్ జార్రాజు తోపాటు జయవర్ధన్, సింహాద్రి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నకిలీ చిరునామాలు, పేర్లతో సిమ్ కార్డులను (SIM CARD) కొనుగోలు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పలవల్సుల సాయికృష్ణ అలియాస్ జార్రాజు ఆధ్వర్యంలో కలాపాలు సాగిస్తున్నారు.
జగిత్యాల జిల్లాకు చెందిన బావు బాపయ్య (43) గతేడాది కంబోడియాకు వెళ్లి రెస్టారెంట్లో Ṭపనిచేశాడు. అంతకుముందు వీరిద్దరు చంఢీ గఢ్ లో కలవడంతో సాయికృష్ణ ఉన్న కంబోడియాకు వెళ్లి ఆయనను కలుసుకున్నారు. అనంతరం స్వదేశానికి రావడంతో బాపయ్య అక్కడి నుంచి సైబర్ నేరాల సెటప్ బాక్సును పార్సల్ ద్వారా పంపించి జన్నారంలో ఏర్పాటు చేయాలని సూచించాడు. బాపయ్య బావమరిది నిందితుడు రాజేష్ మద్దతుతో ఇంటిని అద్దెకు తీసుకొని ప్రారంభించారు. మరో నిందితుడు బావు మధుకర్ ను సైతం కలుపుకున్నారు. తర్వాత ఓ నెట్ వర్క్ డీలర్‌తో నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వారిద్దరితో పాటు రాజేశ్వర్ కు జీతం కూడా ఇస్తానని, వాటా సైతం ఉంటుందని నమ్మ బలికాడు. నిరుద్యోగి అయిన యాండ్రపు కామేశ్ (24) టెలిగామ్ నెంబర్ల కోసం నియమిం చుకో వడంతో డీలింక్ రూటర్లు, భారీస్థాయిలో చిరునామాలేని సిమ్ కార్డులను కొనుగోలు చేశారు. ఏడుగురుతో కలిపిన ముఠా టెలిగ్రామ్ అమాయకులకు ఫోన్లు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇలా సైబర్ నేరాలకు పాల్పడడంతో టెలికమ్యూని కేషన్, సెక్యూరిటీ బ్యూరో జాయింట్ ఆపరేషన్‌తో నిఘాపెట్టి నలుగురిని నల్గురిని అదుపులోకి తీసు కున్నారు. కామేశ్, బావు బాషయ్య, మధుకర్(32) రాజేశ్వర్ (40)లను అదుపు లోకి తీసుకోగా ,సాయికృష్ణతో పాటు జయవర్ధన్, సింహాద్రి పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కనుగొనేం దుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సైబర్ మోసాలపై ఇంటర్నెట్ ప్రొవైడర్లను పరిశీలి స్తున్నట్లు తెలిపారు. నిందిత ముఠా నుంచి సిమ్ బాక్సులు, ఇంటర్నెట్ మోడెం, నాలుగు మొబైల్స్, లాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు.
………………………………..