* కాంగ్రెస్ ఖైరతాబాద్ నియోజకవర్గ సమావేశంలో రభస
* మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ(CONGRESS PARTY)లో మరోసారి వర్గ పోరు బహిర్గతమైంది. మేయర్ విజయలక్ష్మి ఎదుటే ఎమ్మెల్యే దానం నాగేందర్(DANAM NAGENDER), కార్పొరేటర్ విజయారెడ్డి (VIJAYAREDDY) అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. వేదికపై ఉన్న దానం, విజయారెడ్డి కూడా ఒకరిపై మరొకరు పరోక్ష విమర్శలు చేసుకున్నారు. లేక్ వ్యూలో శనివారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ రభస జరిగింది. సమావేశంలో అరగంట పాటు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో సమావేశం హోరెత్తింది. తమ నేతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయారెడ్డి అనుచరులు ఆందోళన నిర్వహించారు. ఈ వ్యవహారంపై సభలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేని కార్యకర్తలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
