* దీపావళికి ముందు భారీగా పెరిగిన వాయుకాలుష్యం
* నగరాన్ని చుట్టేసిన పంట వ్యర్థాల పొగ
* కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య గణాంకాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలుపుతోంది. పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల దహనంతో ఆ పొగ ఢిల్లీని కమ్మేస్తోంది. దీనివల్ల ఇబ్బందులు మరింత పెరిగాయి. దీంతో ప్రభుత్వ అప్రమత్తమైంది. నగరమంతా నీటిని చిమ్ముతోంది. కాలుష్యం తగ్గించే చర్యలు చేపడుతోంది. కాలుష్య నియంత్రణ మండలి అంచనాల ప్రకారం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-50 మధ్య ఉంటే గాలి నాణ్యత మంచిగా ఉందని భావిస్తారు. AQI 51 నుంచి 100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైన గాలి నాణ్యతగా పరిగణిస్తారు. AQI 101 నుంచి 200 మధ్య ఉంటే మధ్యస్థంగా గాలి నాణ్యత ఉందని, AQI 201నుంచి 300 మధ్య ఉంటే ప్రమాదంలో పడినట్లే అని పేర్కొంటారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 293 పాయింట్లుగా గాలి నాణ్యత ఉంది. దీపావళికి ముందు భారీగా పెరిగిన వాయుకాలుష్యం పెరగడంతో పండగ సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో కఠిన నిర్ణయాల అమలుకు ఢిల్లీ సర్కారు శ్రీకారం చుడుతోంది. టపాకాయల తయారీ, విక్రయం, వినియోగంపై నిషేధం అమలు చేయడం, భవన కూల్చివేతల సమయంలో కాలుష్యం పెరగకుండా చర్యలు చేపట్టడం, నిర్మాణ రంగ వ్యర్థాల తరలింపులో జాగ్రత్తలు పాటించేందుకు నిబంధనలు అమలు చేస్తోంది.
………………………………………