* సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: పాలన చేతకాక సీఎం రేవంత్ రెడ్డి పనికిమాలిన మాటలు అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపిస్తున్నారు. మూసీ(Musi) మురుగులో కాంగ్రెస్ పార్టీ పొర్లుతున్నదని విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని రేవంత్ చూస్తున్నారన్నారు. బీఆర్ ఎస్(Brs) ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అయిందని కేటీఆర్ చెప్పారు. బిల్డర్లను, రియల్టర్లను బెదిరించకుండానే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్(Hyderabad) దాటేసిందన్నారు.
మీ బడే భాయ్ మోదీ(Modi) ఐటీఐఆర్‌ను రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చేయకపోయినా, ఐటీ ఎగుమతులలో 2035లో చేరుకోవాల్సిన టార్గెట్‌ని 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ దని వెల్లడించారు. మూసీ నదికి అటూ ఇటూ అభివృద్ధి, ఆకాశ హర్మ్యాలు కడుతున్నప్పుడు మరి ఫోర్త్ సిటీ(Fourth city) ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని వెల్లడించారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
