* ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(CONGRESS GOVERNMENT) ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదని, రూ. 2 లక్షల రుణమాఫీ కోసం ఇప్పటికీ రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PRIME MINISTER NARENDRAMODI) ఎక్స్ వేదికగా చేసిన విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డియర్ మోడీజీ.. తెలంగాణ ప్రభుత్వంపై మీరు చేసిన ప్రకటనలో అవాస్తవాలు ఉన్నాయని, వాటిని వివరించేందుకు సంతోషిస్తున్నా అంటూ.. రేవంత్ ఎక్స్ లో పోస్టు చేశారు. ‘‘డిసెంబర్ 7, 2023న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే దాదాపు దశాబ్దం పాటు బీఆర్ ఎస్ BRS చేసిన దుష్పరిపాలన నుంచి రాష్ట్రాన్ని సంతోషాల వైపు తీసుకెళ్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే, రెండు వాగ్దానాలను అమలు చేశాం. TGSRTC బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య సంరక్షణను అమల్లోకి తెచ్చాం. 11 నెలలుగా తెలంగాణాలోని సోదరీమణులు, తల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 101 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణం చేశారు. తగిన నిర్ణయాల ద్వారా ఏడాదిలోపే రూ. 3,433.36 కోట్లను ఆదా చేశాం. తెలంగాణలో రైతే రాజు. భారతదేశంలోనే రికార్డు స్థాయిలో రైతు రుణమాఫీని అమలు చేశాం. 22 లక్షల 22 వేల మంది రైతులు ఇప్పుడు ఎలాంటి రుణం లేకుండా, రాజులా జీవిస్తున్నారు. రూ. 2,00,000 వరకు రైతుల రుణాలన్నీ మాఫీ చేశాం. 25 రోజుల్లోనే 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే సిలిండర్ అందిస్తుండడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువత కోసం అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గ్రూప్ 1, 2, 3 మరియు 4. 11 నెలల కంటే తక్కువ సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 మంది అర్హులైన యువతకు ఉద్యోగాలు కల్పించింది, ఇది బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయని రికార్డులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంగా పాఠశాల విద్యార్థులను విస్మరించింది, దశాబ్దం తర్వాత సంక్షేమ హాస్టళ్లలో పేద పిల్లలకు ఆహారం , కాస్మొటిక్ చార్జీల కోసం 40 శాతానికి పైగా కేటాయింపులు పెంచాము. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని శుభ్రం చేసి పునర్వైభవం తీసుకొస్తున్నాం. గత 10 ఏళ్లలో ఆక్రమణలకు గురై, ధ్వంసం చేసిన మా సరస్సులు, నల్లాలు మరియు ఇతర విలువైన నీటి వనరులను మేము పరిరక్షిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, YI స్పోర్ట్స్ యూనివర్శిటీ, YI ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం బాల్ రోలింగ్‌ను సెట్ చేశాం. మేం ప్రజలకు చేసే ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉన్నాం. బీఆర్ ఎస్ పాలనలో అలుముకున్న చీకటిని పారద్రోలాం. ఉషోదయపు సూర్యుడిలా తెలంగాణ ఇప్పుడు ఉదయిస్తోంది.’’ అంటూ ప్రధానికి రేవంత్(REVANTH) సుదీర్ఘ రిప్లయ్ ఇచ్చారు.
……………………………………………………….