* కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ‘పోరాడి సాధించుకొని.. పదేళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..
ప్రజాస్వామిక తెలంగాణలో.. మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు…హక్కులను అడిగితే బెదిరింపులు..పోరాడితే సస్పెన్షన్లు…ఇది నియంతృత్వ రాజ్యం…నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం..పోరాటం తెలంగాణకు కొత్తకాదు..ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది..ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం.. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం.’’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Brs Working President Ktr) ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కారు(Congress Government)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైకి ప్రజాపాలన అంటూ.., నియంతృత్వ పాలన చేస్తోందని మండిపడ్డారు. తన ట్విటర్ (ఎక్స్) ఖాతాలో కొన్ని పత్రికా కథనాల క్లిప్పింగ్ లను జోడించి కవితాత్మక ధోరణిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
…………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
