
– కమలాపూర్ ఎంపీడీఓ ఔదార్యం
ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామపంచాయతీలో కారొబార్ గా విధులు నిర్వహిస్తున్న సన్నపు ఆంజనేయులు బుధవారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం దహన సంస్కారాల కొరకై 10000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
…………………………………….