* జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కొనుగోలు కేంద్రాలు లేక.. రైతులు పండించిన పంటలు దళారుల పాలవుతోందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా కవిత పాలకుల తీరును ఎండగట్టారు. అకాల వర్షాలతో..రైతులు ఆగమాగం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోసిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు నానా యాతన పడుతున్నారని.. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందనేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని.. విధిలేక దళారులకు అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలోని రైతుల బాధలు ముఖ్యమంత్రికి కనబడడం లేదా అని.. ప్రశ్నించారు. రుణ మాఫీ.. రైతు భరోసా చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని.. ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ.. అన్నదాతలపై లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
