
* చంద్రబాబు కీలక చర్యలు
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. తాజాగా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్(Reverse Tendering) విధానాన్ని రద్దు చేసింది. దాంతో మళ్లీ పాత పద్ధతిలోనే టెండరింగ్ విధానం అమల్లోకి రానుంది. కాగా, మునుపటి జగన్ ప్రభుత్వం 2019లో రివర్స్ టెండర్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 తీసుకొచ్చింది. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు (EO SyamalaRaog) ప్రకటన చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) ఈరోజు తిరుమలలో పర్యటించారు. తిరుపతిపై నమో వెంకటేశా నినాదం మినహా మరేదీ వినపడకూడదని ఆదేశించారు. బాబు పర్యటన ముగిసిన వెంటనే రివర్స్ టెండరింగ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
……………………………………