* అక్కినేని నాగార్జున ఆసక్తికర కామెంట్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన అక్కినేని నాగార్జున.. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సురేఖ, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని టీపీసీసీ పేర్కొన్నప్పటికీ, ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న నాగార్జున న్యాయపరంగా చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే నాంపల్లి కోర్టు(Nampally Court)లో కోండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్లో కోరారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై నాగార్జున స్పందించారు. టాలీవుడ్(Tollywood) మొత్తం తనకు అండగా నిలబడ్డందుకు నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తాను బలమైన వ్యక్తినని ఎప్పుడూ అనుకుంటానన్న నాగ్, తన కుటుంబాన్ని రక్షించే విషయంలో సింహంలా నిలబడతానని స్పష్టం చేశారు. అదృష్టవశాత్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఈ విషయంలో తమకు అండగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన నాన్నగారి ఆశీర్వాదాలుగా భావిస్తున్నాను అంటూ ఓ నోట్‌ను విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఈ నోట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్(Viral) అవుతోంది.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
