* స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైడ్రా దూకుడు మరో సారి పెంచింది. మియాపూర్ లో ఉన్న అక్రమకట్టడాన్నికూల్చివేత పనులు చేపట్టింది. సర్వే నెంబర్లు మార్చి అక్రమంగా నిర్మించారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కూల్చివేతకు ఉపక్రమించింది. అమీన్పూర్ లోని సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలోకి కొంత మంది కబ్జాదారులు చొరబడి నిర్మాణాలు చేసినట్లు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్ ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడి 126/D , 126/ part, 126/C గా ప్లాట్లను భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు సృష్టించారని స్థానికులు ఆరోపించారు,.దీనిపై ఇప్పటికే అమీన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు అక్రమ కట్టడాల తొలగింపునకు శ్రీకారం చుట్టారు.
…………………………………………………
