BRS Mulugu Protest over Congress 1000 Days
* కాంగ్రెస్ 1000 రోజుల పాలనను నిరసిస్తూ నిరసన ర్యాలీ వంటావార్పు
ఆకేరు న్యూస్, ములుగు:
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలను నిరసిస్తూ శనివారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండ్ అవనర్లో ఆవరణలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు, మహిళలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు . ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, నియోజకవర్గం ఇంచార్జ్ బడేనాగజ్యోతి, భూక్య జంపన్న, స్థానిక మండల కమిటీ అధ్యక్షుడు దండుగల మల్లయ్య, సర్పంచులు దిడ్డి మోహన్ రావు ,కోటెం ప్రవళిక గున్ను, ఊరటం రంగాపూర్ సర్పంచ్ లతోపాటు తాజా మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు యువతీ యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
