* ముఖ్యమంత్రిపై మాజీ ఎంపీ విమర్శలు
* జూబ్లీహిల్స్ లో మాగంటి సునీతను ఆదరించాలని పిలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthrddy) ప్రచార తీరుపై బీఆర్ ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు (Nama Nageswar rao) విమర్శలు వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ.. అమీర్‌పేట మైత్రీవనం సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి తీరతా అని స్పష్టం చేశారు. అలాగే ఎన్టీఆర్ ను కొనియాడారు. దీనిపై నామా స్పందించారు. మీడియా సమావేశంలో మట్లాడుతూ ఉప ఎన్నిక రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఈరోజు ఆయన పేరు రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడని, తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం గుర్తుకురాలేదు అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అభిమాని మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అకాల మరణంతో వచ్చిన ఎన్నికలో సునీతకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని, మూడు సార్లు గోపీని ఆదరించినట్లే సునీతను ఆదరించాలని తెలిపారు. చివరి వరకు ఎన్టీఆర్ వెంట ఉన్న నేత మాగంటి గోపీనాథ్ అని గుర్తు చేశారు. కేసీఆర్ (KCR) హయాంలో హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని వివరించారు. ఖమ్మంలో 60 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని తామే పెట్టామని, ఎన్టీఆర్ చరిత్రను గ్రానైట్‌పై రాశామని ఆ రాళ్లను తొలగించారని తెలిపారు. ఇవాళ ఉప ఎన్నిక కోసం ఎన్టీఆర్ విగ్రహం అని మాట్లాడుతున్నారని, పార్లమెంట్లో విగ్రహం పెట్టేందుకు అన్ని రకాలుగానూ ప్రయత్నాలు చేశామని వివరించారు.
………………………………………………………..
