
* ఖమ్మం జిల్లాకు ముగ్గురు.. నల్గొండకు ఉంటే తప్పేంటి
* మంత్రి పదవి ఆలస్యమైనా పర్లేదు.. మునుగోడు అభివృద్ధిని ఆపొద్దు
* అన్నదమ్ములం ఇద్దరమూ సమర్థులమే
* కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్లు చేశారు. మీరు మంత్రి ఇచ్చినప్పుడే ఇవ్వండి.. కానీ మునుగోడు అభివృద్ధిని మాత్రం ఆపొద్దు.. అని అన్నారు. మంత్రి పదవి ఇస్తామన్న మాట ఆలస్యమైందని, సమీకరణాలు కుదరడం లేదంటున్నారని తెలిపారు. సమీకరణాలు కుదరకుండా ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తాము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామన్న విషయం తనను పార్టీలోకి తీసుకునే ముందు తెలియదా అని రాజగోపాల్ రెడ్డి (Rajgopal reddy)అన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం (Khammam) జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని వెల్లడించారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ (Nalgonda) జిల్లాలకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పా అని ప్రశ్నించారు. అన్నదమ్ములిద్దమరూ సమర్థులమే అని స్పష్టం చేశారు. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన్నారు. పదవి ఇవ్వడం ఆలస్యమైనా తాను ఓపికతో ఉంటున్నానని, ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమేకానీ, తన కోసం కాదన్నారు. పదవి మీకు ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడే ఇవ్వండి కానీ.., మునుగోడు అభివృద్ధి ని ఆపొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
……………………………………….