
ఇపుడేమంటారు..?
- రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
- దానం నాగేందర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు
- ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అప్పుడు రాళ్ళతో కొట్టాలన్నారు కదా.. ఇపుడెందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు. బీఆర్ ఎస్ పార్టలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగెందర్ను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఫార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కోరారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. గతంలో దానం నాగేందర్‌పై ఎన్నో రకాల అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఇపుడు ఎట్లా పార్టీలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. మేము కాంగ్రెస్ పార్టీ ని కూల్చాలని అనుకోవడం లేదన్నారు. నిండు ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. సింహం రెండగుడుగులు వెనుకకు వేసిందంటే భయపడిందని అర్థం కాదు. పూర్తి స్థాయి దాడికి సిద్దమవుతోందని అర్థం అని తెలుసుకోవాలన్నారు. గతంలోలాగా పార్టీ మారిన వారిపై వేటు వేసేందుకు చాలా కాలం పట్టదని మూడు నెలలోపే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. స్పీకర్ సైతం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు.
