ధృవీకరించిన రాష్ట్రపతి భవన్ వర్గాలు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేశారు. ఈ అంశాన్ని రాష్ట్రపతి భవన్ వర్గాలు దృవీకరించాయి. తమిళనాడు రాష్ట్ర నుంచి లోక్ సభ బరిలో దిగేందుకే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆమె తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో చెన్నయి సెంట్రల్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తో తీవ్రస్థాయిలో ఘర్షణ వైఖరి నెలకొన్నది. చాలా సంధర్భాల్లో గవర్నర్ను కేసీఆర్ ప్రభుత్వం అవమానించిందని ఆమె బహిర్గతంగానే చెప్పేవారు. క్లిష్ట సమయాల్లో కూడా గవర్నర్గా ఎంతో హుందాగా , ధైర్యంగా వ్యవహిరించారని బీజీపే అధిష్టానం భావించింది. దీంతో ఆమెను ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.