* ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, జగిత్యాల: గురుకుల పాఠశాలల విద్యార్థులకు పెంచిన డైట్చార్జీలను కస్తూర్భా పాఠశాలలకు కూడా వర్తింప చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం కవిత సందర్శించారు. ఈ సందర్భంగా కవిత విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో మధ్యాహ్నభోజనం ధరలు పెంచుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానని.. గురుకులాల్లో మార్పుల్లో కస్తుర్భా పాఠశాలలు లేకపోవడం బాధకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్భా పాఠశాలలున్నాయని, సర్వశిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నారని, వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
………………………………………