
ఆకేరు న్యూస్ ములుగుః ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం, మండలాలలో మొక్కజొన్న పంట నష్టపోయిన 671 మంది రైతులకు సోమవారం నష్టపరిహారం పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ , సహకారం, చేనేత, వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, తెలంగాణా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, తెలంగాణా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,ఐటీడిఏ పి.ఓ.చిత్ర మిశ్రా లతో కలిసి 3 కోట్ల 80 లక్షల 97 వేల 264 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రైతుల సంక్షేమ కమిషన్ సభ్యులు మరికాంతి భవాణి, రాములు నాయక్, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, కె.వి. నర్సింహా రెడ్డి, మాజి ఎంఎల్సి బాల సాని లక్ష్మీనారాయణ, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, అదనపు ఎస్ పి సదానందం, ఆర్డీఓ వెంకటేష్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………….