
* వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 18004257109 ఏర్పాటు.
* ములుగు కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరున్యూస్, ములుగు: ప్రస్తుత వర్షాకాలంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని, జిల్లా ప్రజలు, జిల్లా అధికారిక వాట్స్ అప్ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకొని సూచనలు పాటించాలని కలెక్టర్ దివాకర టి.ఎస్. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్. 18004257109 ల్యాండ్ లైన్ నెంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, ముంపు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను వెంటనే ఆ ప్రాంతానికి పంపడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. అత్యవసర సేవలకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు దాటకుండా గ్రామాలలో టాంటాం ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల బారిన పడకుండా భారీ కేడిరగ్ , సూచిక బోర్డ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలకు తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రజలు సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
…………………………………..