* అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి
* ముంబైకు వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులు
* పార్థివదేహం వద్ద నివాళి అర్పించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు
ఆకేరు న్యూస్, ముంబై : పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) దివికేగారు. కోట్లాది మంది భారతీయులకు టాటా చెబుతూ తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. కాసేపటి క్రితమే ముంబై లోని వర్లి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో మహారాష్ట్ర సర్కారు ఆ మహానుభావుడి అంత్యక్రియలు నిర్వహించింది. అంతకుముందు ఆయన చేసిన సేవలకు గుర్తింపునకు గాను రతన్ టాటా భౌతికకాయంపై జాతీయ జెండా కప్పారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులు ముంబైకు చేరుకున్నారు. ఎన్సీపీఏ మైదాన్‌లో ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ రతన్ టాటాకు నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
……………………………..