
* ఆగిన గుండెను సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
ఆకేరున్యూస్, వరంగల్: ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడాడు. వివరాల ప్రకారం.. వరంగల్ రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్‌ను పలువురు అభినందించారు.
……………………………