* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆకేరు న్యూస్, కొండారెడ్డిపల్లి : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy) దసరా సందర్భంగా నిన్న సొంతూరు కొండారెడ్డిపల్లి (Kondareddy palle)గ్రామానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పండగను అక్కడే జరుపుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈరోజు ఉదయం నుంచీ కార్యకర్తలు, ప్రజలతో భేటీ అయ్యారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 72 లక్షల వ్యయంతో మోడల్ పంచాయితీ భవన నిర్మాణం, 50 లక్షల లైబ్రరీ భవన నిర్మాణం, 45 లక్షల వ్యయంతో వెటర్నీరీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం హైదరాబాద్(Hyderabad)కు బయలుదేరారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
