* ఎలక్ట్రానిక్ మీడియా కూడా తొలగించాలి
* డాక్టర్లు వెంటనే విధుల్లో చేరాల్సిందే
* సుప్రీంకోర్టులో కోల్కతా వైద్యురాలి లైంగికదాడి కేసు విచారణ
ఆకేరు న్యూస్ డెస్క్ : కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై లైంగికదాడి, హత్య కేసు(Jr Doctor murder and rape case)ను సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు(SUPREME COURT ) ధర్మాసనం ఈ రోజు సోమవారం విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (Chief Justice Chandrachud) ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు డాక్టర్ కుటుంబానికి మద్దతుగా నిరసనలు కొనసాగుతుండగా, మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. బాధితురాలి ఫొటోలు సోషల్మీడియా(Social media)లోను, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎక్కడా కనిపించకూడదని ఆదేశించింది. ఎక్కడ, ఎవరైన పోస్టు చేస్తే వెంటనే డిలీట్ చేయాలని పేర్కొంది. అలాగే.. ఆందోళనలు చేస్తున్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని న్యాయస్థానం ఆదేశించింది. డాక్టర్ల విధులు బహిష్కరణ వల్ల 23 మంది చనిపోయారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా, బెంగాల్ ప్రభుత్వం(Bengal Government) తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. విధుల్లో చేరిన వైద్యులపై సర్కారు చర్యలు ఉండబోవని ఆయన హామీ ఇచ్చారు. వాదనలు విన్న అనంతరం ఘటన జరిగిన రోజున మధ్యాహ్నం 1.47 గంటలకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ తర్వాత 2.55 గంటలకు అసహజ మరణంగా కేసు నమోదైనట్టు పేర్కొన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసం. ఆ అసహజ మరణం నివేదికపై స్పష్టత రావాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అలాగే, అప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకి ఇచ్చారా..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే, వైద్యుల భద్రతకు సంబంధించి సర్కారు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబరు 17కు వాయిదా వేశారు.
————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
