– జాగ్రత్త పడండి.. లేదంటే నష్టపోవడం ఖాయం
హైదరాబాద్, ఆకేరు న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో నగరాల విస్తరణ క్రమంగా పెరుగుతుంది. దీంతో భూముల ధరలతో పాటు నగరాల్లో ఇండ్ల, ప్లాట్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే వీటిని సేల్ చేసేందుకు నిర్మాణ సంస్థలు అనేక ఆకర్షనీయ ప్రకటనలు ప్రచారం చేయడం జరుగుతుంది. కొన్ని స్థిర నిర్మాణ సంస్థలు ఇచ్చే ప్రకటనలు నమ్మితే ప్రజలు నట్టెట మునగడం ఖాయం, ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోయిన్ బయ్యర్లు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలోనే కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేముందు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని, పెట్టుబడులు పెట్టే ముందు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రధానంగా ….
– ముఖ్యంగా బిల్డర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేశారా..? బిల్డర్ల, డవలపర్ల గత చరిత్ర, నాణ్యత ప్రమాణాలు ఏ మేరకు పాటించారు వంటి అంశాలపై దృష్టి సారించాలి.
– హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో ఏ లేఅవుట్ అయినా రెరా అనుమతి ఉండాలి.
– రెరా అనుమతి ఇచ్చిన వెంచర్లలో మొత్తం ప్లాట్లలో 15 శాతం మార్టేజ్ చేస్తారను..
– వీటిని కొనుగోలు చేయకూడదు. ఆ ప్లాట్లలో ఎర్ర మార్కు ఉంటే అవి ఇంకా మార్టిగేజ్లోనే ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
– నివాస దృవపత్రం వచ్చిన ప్లాట్లను మాత్రమే కొనుగోలు చేయాలి.
– మొదటి, రెండు అంతసుల్లోని ప్లాట్లు జీహెచ్ఎంసీ మార్ట్ గేజ్లో ఉంటాయి. బిల్డింగ్ అనుమతి ప్లాన్లోను ఈ ఫ్లాట్ల వివరాలు ఉంటాయి.
– ప్రభఉత్వ నిబంధనలు పాటించిన భవనాలకు మాత్రమే నివాస ధృవపత్రాలు జారీ చేస్తారు. లేదంటే ఆ భవనం ఇల్లీగల్ అని భావించాలి.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
